కిడ్నీ వ్యాధులకు సంబంధించిన సమగ్ర వైద్య సమాచారం ''కిడ్నీ కేర్‌''లో లభ్యం.

మన శరీరానికి గుండె, మెదడు, ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో మూత్రపిండాలు కూడా అంత ముఖ్యమైనవి. మనం ఆరోగ్యంగా ఉండటానికి మూత్రపిండాలు చాలా అవసరం. పిడికిలంత సైజులో చిన్నగానే ఉన్నా కూడా మూత్రపిండాలు లేకుండా మనం ఎక్కువకాలం బ్రతకలేము.

శరీరంలోని మిగతా అవయవాలు తమకుతాము సక్రమంగా పనిచేయటానికి మూత్రపిండాల మీద ఆధారపడతాయంటే ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కాదు.

కిడ్నీలు ఎందుకు పాడవుతాయి: కిడ్నీ వ్యాధులు ఎక్కువగా కిడ్నీలోని నెఫ్రాన్స్‌ మీద దాడిచేస్తాయి. ఫలితంగా నెఫ్రాన్లు తమలోని వడబోసే సామర్థ్యాన్ని కోల్పోతాయి.

నెఫ్రాన్లు డామేజ్‌ కావటం ఒకోసారి చాలా వేగవంతంగా జరగవచ్చు. దెబ్బలు తగలటం లేక విషపూరితం కావటం లాంటి సందర్బాలలో మాట ఇది. అయితే చాలా భాగపు కిడ్నీ వ్యాధులలో నెఫ్రాన్లు అతి నిదానంగా, అసలు మనకు ఏమాత్రం తెలియకుండా సైలెంట్‌గా పాడవుతాయి. దశాబ్ధాలపాటుగా కూడా మనకా డామేజ్‌ గురించి తెలియనే తెలియదు. ఆఖరున హటాత్తుగా ఎప్పుడో బయటపడుతుంది.

అక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ : కొన్ని కిడ్నీ సమస్యలు అప్పటికప్పుడు అకస్మాత్తుగా వస్తాయి. ఉదాహరణకు ఏదన్నా యాక్సిడెంట్‌ జరిగినప్పుడు కిడ్నీలకు పెద్ద దెబ్బ తగిలి డామేజ్‌ కావచ్చు. అలాగే తీవ్ర రక్తస్రావం అయినప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు.

Pages : 223

Write a review

Note: HTML is not translated!
Bad           Good