1956 ఫిబ్రవరి 25న, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శి నికిటా కృశ్చేవ్ మూడు దశాబ్దాలుగా సోవియట్ కమ్యూనిస్టు పార్టీకీ, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికీ నాయకత్వం వహించిన మహా నాయకుడు స్టాలిన్ను ఒక హంతకుడిగా, రాక్షసుడిగా, మూర్ఖుడిగా, మానసిక రోగిగా, పిరికిపందగా చిత్రిస్తూ చేసిన రహస్య ప్రసంగం 'ప్రపంచాన్ని కుదిపి వేసిన ప్రసంగం'గా చరిత్రలో ఖ్యాతి లేదా అపఖ్యాతి సంపాదించుకుంది. ఈ ప్రసంగం నిజంగానే ప్రపంచాన్ని కుదిపి వేసింది. పెట్టుబడిదారీ ప్రపంచం కేరింతలు కొడుతుంటే కమ్యూనిస్టు ప్రపంచ తలక్రిందులైంది. అక్టోబరు విప్లవం నుండి పురోగమిస్తున్న ఎర్రజెండా తెల్లబోయి, వెలిసిపోయి, చినిగిపోయి, చివరకు కూలిపోయింది.
ఈ ప్రసంగంలో కృశ్చేవ్ వాస్తవాలే చెప్పాడా? ఆ కాలంలో కొంతమంది కమ్యూనిస్టులు కృశ్చేవ్ నిజమే చెప్పాడని నమ్మారు. నమ్మనివారు నమ్మమని చెప్పారు కానీ ఎందుకు నమ్మలేరో చెప్పలేకపోయారు.
1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అసలు స్టాలిన్ యుగంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ఒక చారిత్రక పరిశోధన ప్రారంభమైంది. గ్రోవర్ ఫర్ ఇంగ్లీషులో రచించిన ''కృశ్చేవ్ లైడ్' పుస్తకానికి తెనుగు అనువాదం కృశ్చేవ్ అసత్యాలు అటువంటి పరిశోధనా గ్రంథం. ఈ పుస్తకంలో గ్రోవర్ ఫర్, చారిత్రక పత్రాల ఆదారంగా కృశ్చేవ్ రహస్య ప్రసంగమంతా అబద్ధాల పుట్ట అని రుజువు చేశారు. ఈ అసత్య ప్రసంగం కమ్యూనిస్టు ఉద్యమాన్ని నాశనం చెయ్యడానికి జరిగిన ఒక కుట్ర అని ఇప్పుడు మనకు స్పష్టమవుతోంది. ఈ కుట్ర స్వభావాన్ని కమ్యూనిస్టులు అర్థం చేసుకొని, స్టాలిన్ మీదా, కమ్యూనిజం మీదా, నేడు జరుగుతున్న దుష్రప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఈ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుంది.
పేజీలు : 488