"నాకు అసలు మనసే లేదు. మీరు కళ్ళు లేని వాళ్ళనీ...
చేతులు లేని వాళ్ళనీ చూసి వుంటారు. కానీ మనసు లేని
వాళ్ళని చూసి వుండరు! ఇప్పడు చూడండి... నాకు మనసు లేదు.
మనసే కాదు జాలీ, దయ, బాధ కూడా లేవు! ఎందుకుండాలి?
పుట్టగానే పసిగుడ్డు అనైనా లేకుండా చెత్త కుండీలో కుక్కలకి
ఆహారంగా వేసిన నా తల్లికి లేని మనసు... నాకు ఎక్కడనుంచి వస్తుంది?
అమ్మవారి జ్వరంతో వళ్ళు తెలియకుండా పడివున్న నన్ను
ధర్మాసుపత్రికి తిసుకేల్తే ఎవరూ చూడకుండా నన్ను రేప్
చేయబోయిన వార్డ్ బోయ్ కీ లేని దయ నాకెందుకూ?
కార్లలో తిరుగుతూ, ఫైవ్ స్టార్ హోటల్స్ లో మీరు
విలాసంగా తింటూవుంటే... మేం పురుగుల బియ్యం,
ముక్క వాసన కొట్టే పప్పుతో కడుపు నింపుకోవాలేం?
మా శరీరాన్ని కప్పుకోవడానికి బట్ట ముక్క కరువుగా వుంటే...
మీరు మాత్రం బీరువా పట్టనన్ని బట్టలు కొనుక్కుంటారేం?
మీరేమైనా తల మీద కొమ్ములతో పుట్టారా?
పై వాడ్ని కాకా పట్టి ఇటువంటి జాతకాలు వ్రాయించుకున్నారా?"
కసి తపన కారుణ్యం తెలియని,
ద్వేషం తప్పదయ లేని, ఆడంబరం తప్ప అనురాగం అంటే
అర్ధం తెలియని ఒక అనాధ అమ్మాయి కధ ఖజురహో!

Write a review

Note: HTML is not translated!
Bad           Good