నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌

ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ

ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,

ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,

నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,

ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,

అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,

అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!

దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,

నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,

డియర్‌ కామ్రేడ్‌! విను! నాతో రా మునుముందుకి, ఈ

ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,

జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.

వాల్ట్‌ వైట్‌మాన్‌ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ 'కామ్రేడ్‌' శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు - మరికొన్ని అనువాద కవితలు (120) - వాటికి సంబంధించిన ఫుట్‌ నోట్స్‌ ఉన్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good