1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 1994 భారతీయ భాషా పరిషత్ అవార్డును, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును పొందిన కథల సంపుటి 'కేతు విశ్వనాథరెడ్డి కథలు'.
తనకు తెలిసిన సంఘ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాలను ప్రగతిశీల దృక్పథంతో కథలుగా అరవయ్యో దశకం నుంచి మలచిన మంచి రచయిత కేతు విశ్వనాథ రెడ్డి. ఆయన కథలు కొన్ని కన్నడం, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఇంగ్లీషు, రష్యన్ భాషల్లోకి అనూదితమయ్యాయి.
మా సంస్ధ ప్రచురించిన కుటుంబరావు సాహిత్యం సంపాదకుడుగా కేతు విశ్వనాథ రెడ్డి సృజనాత్మక రచనల సంపాదకత్వానికి ఒరవడి దిద్దారు. గ్రామనామ పరిశోధకుడిగా ఒక పరిశోధనా మార్గానికి తెలుగులో దారి చూపారు.
1974 నుండి రాసిన కథల్లో ఇంతవరకు పుస్తక రూపంలో రాని, పలువురిచే ప్రశంసలందుకున్న 30 కథలను ఈ పుస్తకంలో మీ కందిస్తున్నాము. ఆదరిస్తారని ఆశిస్తున్నాం. - ప్రచురణ కర్తలు
Rs.100.00
In Stock
-
+