2009 అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కార గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి కథలు - 2....

ఒక వాల్మీకి

రాజులుకు వాల్మీకి అంటే చాలా ఇష్టం; ముదిజేజి కన్నా ఇష్టం; అమ్మ కన్నా ఇష్టం; బళ్లో చదువు చెప్పే రాములు సారు కన్నా ఇష్టం; తనకున్న ఇద్దరు ముగ్గురు సాహసగాళ్ళ కన్నా ఇష్టం. వాల్మీకిని రాజులు ''తాతా!' అని పిలుస్తాడు. 'మనవడా' అని వాల్మీకి రాజులును పిలుస్తాడు. ఎప్పుడైనా రాజులు ముదెబ్బ కాలం నాటి సంగతులు చెప్పేటప్పుడో, ముదిజేజి ప్రస్తావన కొచ్చినపుడో 'అదీ చిన్రెడ్డీ కత! అని ముగించేవాడు. వాడిన బంగారం రంగు శరీరం, చాలీ చాని పై పంచె భుజాల చుట్టూ కప్పుకొని, గోచీపోచీ కట్టిన పంచె, తెల్లబడి మెడ కిందకి వాలిన జుట్టు, పెద్ద నుదురు, ఎక్కడికో చూస్తున్నట్లు ఉండే కళ్లు, కొనదేలిన ముక్కు, నోరు తెరిస్తే తప్ప స్పష్టంగా కనిపించని తెల్లటి మీసాల గుబురులో దాక్కున్న పెదాలు, పొడవాటి నెరిసిన గడ్డం, అమ్మ చెప్పిన కథల్లోని ఋషులు ఇట్లాగే ఉండి ఉంటారని రాజులు నమ్మకం. బడిలో గోడకు వేలాడదీసిన రవీంద్రనాథ్‌ టాగూర్‌ బొమ్మ చూసినప్పుడు వాల్మీకి తాత లాగే ఉన్నాడని రాజులు అనుకునేవాడు...

Write a review

Note: HTML is not translated!
Bad           Good