" ఆ గదిలో అడుగుపెట్టగానే అలంకార శిభిటంగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నీ సంగీతంలో ఆవిడా సంవత్సరాలుగా చేసిన కృషిని చూపిన ప్రజ్ఞాపాటవాలకి మెయిలు రాళ్ళని చెప్పవచ్చు.
కొటిమందిలో - ఏ ఒక్కరికో , ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం ఆవిడకి భాగవత్ప్రసాదంగా లభించింది. అది యెనలేని కీర్తి ప్రతిష్ట లని సంపాదించి పెట్టింది. డబ్బు పేరు ఆవిడ కోరకుండానే కష్టపడకుండానే ఆవిడని వెతుక్కుంటూ వచ్చాయి.
ఆమె రాజ్యలక్ష్మి ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కీరీటాలు పెట్టింది. అయితే ఇంద్ర ధనుస్సుకు మల్లె ఆమె అదృష్టం కూడా అలా మెరిసి ఇలా మాయమయింది . ఆమె వైవాహిక జీవితమంతా అస్తవ్యస్తం. రెండు పెళ్ళిళ్ళు ఆమెను చెప్పలేని ఒత్తిడిని లోను చేశాయి. మొదటి భరతో కాపురం వాళ్ళ తేజ పుట్టాడు. అయితే పొరపొచ్చాలు మూలంగా విడాకులు తీసుకోవలసి వచ్చింది. కొడుకును కోర్టు భర్త కె అప్పగించింది. తండ్రి పోయాడు. విడాకులు పొందిన భర్త పోయాడు.
తోడూ కోసం మరో పెళ్లి, విదేశీ ప్రయాణం. .. ప్రవాసం... రెండో భర్తకి అదివరకే వున్నా కొడుకు కిషోర్ ను పెంచి పెద్ద చేసింది. కిషోర్ రాజ్యలక్ష్మి ణి ద్వేషించాడు. ఏమిటి ఆమె ముందున్న దారి ? కన్నకొడుకు కాకుండా పోయాడు. ఉన్న కొడుకు శత్రువులా చూస్తాడు. ఒక సంగీత కళాకారిణి జీవితంలోని అపస్వరాలని ఆర్ధంగా చిత్రించే నవల కీర్తి కీరీటాలు. దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good