ఇది  విశ్వనాథ గురించిన శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం. విశ్వనాథ గురించి శ్రీశ్రీ ఎన్నో విషయాలు చెప్పాడు. ఎంతో విశేషంగా చెప్పాడు. కుండబద్దలుగొట్టి మరీ చెప్పాడు. అందుకే ఇందులో అంబరాన్ని ఎక్కించిన కాంప్లిమెంట్సూ ఉన్నాయి, అర్ణవంలోకి విసిరేసిన కామెంట్సూ ఉన్నాయి. 

    విశ్వనాథ, శ్రీశ్రీలు పరస్పరం బద్ధ శత్రువులనేది చాలామంది అభిప్రాయం. ఈ పుస్తకం చదివితే ఆ అభిప్రాయం తప్పని తెలుస్తుంది. తప్పని తేలుతుంది. శ్రీశ్రీ శత్రుత్వం విశ్వనాథతో కాదు, విశ్వనాథవారి భావజాలంతో అని తెలుస్తుంది.

    ''నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం. వారంటే నాకు గౌరవభావం. అటువంటప్పుడు పరస్పరం దూషించుకోవడం అనే ప్రసక్తేలేదు'' అంటాడు శ్రీశ్రీ.

    ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురిస్తున్న నూరు పుస్తకాల హోరులో 62వ పుస్తకం. - కన్వీనర్‌ శ్రీశ్రీ సాహిత్యనిధి

Write a review

Note: HTML is not translated!
Bad           Good