భారతీయ సంస్కృతిని, ఆలోచనను, ప్రజల జీవన విధానాన్ని అతి ప్రాచీన కాలం నుంచి విశేషంగా ప్రభావితం చేస్తూ వచ్చిన కవులు, రచయితలు, తత్వవేత్తలు, నాటక కర్తలు గురించి, వారి జీవితం, రచనలు గురించి పాఠకులకు అధికారిక పరిజ్ఞానం కలిగించడం ఈ గ్రంథమాల లక్ష్యం. ఋషులు, తత్త్వవేత్తలు, కవులు, నాటకకర్తలు, మార్మికులు, ధార్మిక నేతలు, సంగీతవేత్తలు, విజ్ఞాన శాస్త్ర రచయితలు అయిన 125 మంది మహనీయుల గురించి ఈ గ్రంథమాల ద్వారా తెలియపరుస్తున్నారు. ఇవి సామాన్య పాఠకునికి ఉద్దేశించినవి. గత వైభవం గురించి తెలుసుకోవాలనుకొన్నప్పటికీ సరైతన మార్గదర్శక సమాచారం లేనివారి కోసం రూపొందించినవి. వీటిలో సున్నితమైన (విద్యా), సమాచార విషయాల ప్రసక్తిలేదు. ప్రసిద్ధ సంస్కృత పండితులు, భారతీయ చరిత్రవేత్తలు స్వర్గీయ డాక్టర్‌ వి.రాఘవన్‌ ఈ గ్రంథమాలకు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good