Rs.140.00
Out Of Stock
-
+
''గుప్పెడు మట్టిని పీల్చుకుంటే
గుండె అంతరిక్ష మవుతుంది''
''మట్టికూడా పడుండదు చచ్చినట్లు
అట్టడుగునుంచి చిమ్ముకొస్తుంది (వెలుగంటే విముక్తి)
చెట్టు చేతులతో మట్టిని పీల్చుకోవడమంటే శ్రమలో నిమగ్నం కావడం. శ్రమలో నిమగ్నమయినప్పుడే మనిషి మనిషిగా మనగలుగుతాడు. అప్పుడతని గుండె అంతరిక్షమవుతుంది. ఈ అంతరిక్షం భావకవి అంతరిక్షం కాదు. అభ్యుదయ కవి విహార భూమి. మట్టికి చెట్లు చేతులవ్వడం ప్రకృతిని మానవీకరించడమే. సమాజంలోని అట్టడుగు వర్గ చైతన్కయమే నిజమైన చైతన్యం. అది శ్రామికవర్గ చైతన్యం. మట్టి చెట్టుచేతులతో అట్టడుగునుంచి చిమ్ముకొస్తుందని కవి ఈ శ్రామిక వర్గ చైతన్యాన్నే సూచించారు. శ్రామికవర్గ చైతన్యాన్ని శ్రామికవర్గ భాషలోనే అభివ్యక్తం చేయడానికి ఇక్కడ కవి సామాజికనేపథ్యమే తోడ్పడుతుంది. విశ్రాంతి వర్గకవుల కవిత్వంలో ఈ అభివ్యక్తి ఉండదు.
Pages : 207