ఈ సంపుటిలోని కవితలు ఈ శతాబ్ది తొలి దశాబ్దిలో వెలువడిన హిందీ కవితలకు తెలుగు అనువాదాలు. ఇవి ఇంచుమించుగా అన్నీ వివిధ పత్రికల్లో వెలువడినవే. ఈ కవితల్ని చదువుతుంట ఇవి తెలుగులో రూపొందించిన మౌలిక కృతులే అనిపిస్తాయి. వల్లభరావు అనువాద చాతుర్యం అందుకు దోహదంచేసింది. ఉంగరాలు, పాతచొక్కా, డప్పులవాళ్లు ఆ బూటు-ఇలా ఈ శీర్షికలు చదువుతుంటేనే మూల రచయిత వస్తువైవిధ్యం ప్రస్ఫుటమౌతుంది.
- సి. నారాయణరెడ్డి

'కవితాభారతి' చదువుతుంటే ఎలా అనిపిస్తుందంటే, ఒక తెలుగుకవి వెలువరించిన ఒక కవితా సంపుటిలా ఉంది. ఎందుకంటే అటువంటి సామాజిక కవితల్ని అనువదించారు వెన్నా వల్లభరావు. చాలామంది ప్రజాభాషలోకి అనువాదం చెయ్యటంలో జయం పొందలేరు. అర్థాన్ని గిట్టించడానికి సంస్కృతశబ్ధాల్నీ, సమాసాల్నీ, క్లిష్టతనీ ఆశ్రయిస్తారు. కానీ వల్లభరావు అనువాదం తెలుగు కవితలా ఉంది తప్ప అనువాదంలా లేదు. ఈ అనువాద గ్రంథం అనువాద కౌశలాన్నే గాక సామాజిక ప్రయోజనాన్ని కూడా నింపుకుని ఉండడం ఎంతైనా ప్రశంసనీయం.
- అద్దేపల్లి రామమోహనరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good