థిలాన్‌ ధామస్‌ చెప్పినట్టు కవిత్వం మనలని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, సూదిలా గుచ్చుతుంది. మనల్ని నిశ్శబ్దంలా మారుస్తుంది. మనలని శబ్దమై కదిలిస్తుంది. ఏ పని చెయ్యాలో, చెయ్య కూడదో తెలియజేస్తుంది. ఈ అపరిచిత ప్రపంచంలో మన ఒంటరితనాన్ని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మన పరిచయస్థులని పరిచయం చేస్తుంది. మనలని సమూహంగా మారుస్తుంది. ఒకొక్క సారి మనలని ఒంటరిగా నిలబెట్టి మూల్యాంకనకు అవకాశమిస్తుంది. కవిత్వం బహుశా మన నగ్నత్వంలోని నిజాన్ని పరిచయం చేస్తుంది. ఇవన్నీ కలసికట్టుగా మనలోకి జొరబడినపుడు ఆ కవిత్వం తనపని తాను సాధించినట్టే, 2015లో వచ్చిన అనేక కవితలు చదివిన తర్వాత, కవులు కాలం చేసిన గాయాలకి మలాము రాస్తూ... గాయం చేయలేని భవిష్యత్‌కు ఆశలు కల్పించే సైనికులుగా అనిపించడం గమనార్హం.

2015 కవిత్వం ఒక ఫ్రెష్‌నెస్‌ ఇస్తుంది. యువతరాన్ని వినిపిస్తుంది. సాహిత్య సమావేశాలకి, స్నేహాలకి దూరంగా ఉండి... కాలాన్ని పరికిస్తున్న ఎంతో మంది వ్యక్తుల కలం జాడలను పరిచయం చేస్తుంది.

Pages : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good