పదేళ్ళు. పది సంకలనాలు. వేల కవితల సందర్శనం. అనేక మానవానుభవాల్లోకి ప్రయాణం. భిన్నమైన వస్తువులకు కవితాత్మక రూపాలు. పలు శైలీరీతులు. తెలుగు కవిత్వం వస్తు పరంగానూ, రూపపరంగానూ విస్తృతిని సాధిస్తూ వస్తుందన్న ఒక అవగాహన. ఒక తృప్తి. కొంత కళానందం.

ఇది పదకొండవ సంకలనం. రాజకీయంగా, సాంస్కృతికంగా 2014వ సంవత్సరం తెలుగువారికి కీలకసంవత్సరం. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా రూపొందిన సందర్భం. ఉద్వేగాలకు సాక్ష్యంగా నిల్చిన సంవత్సరం. ఈ ఉద్వేగాలు ఏకరీతి కావు. పరస్పర విరుద్ధమైనవి. ఆనందం వెల్లివిరిసిన సందోహమున్నట్లే విచారాన్ని వెలిబుచ్చిన సమూహమూ వుంది. రాజకీయంగా విడిపోయినా తెలుగు ప్రజల భాష ఒకటే. భాషావరణం ఒకటే. మనుషుల్ని కలపడానికి భాషను మించిన గొప్ప సాధనమేముంది? ప్రజాజీవితం సారవంతంగా వుండాలని కోరుకున్నట్లే, ఆ ప్రజాజీవితాన్ని ప్రతిబింబించే, వ్యాఖ్యానించే సాహిత్యమూ సారవంతం కావాలని కోరుకుంటా.

2014 సంవత్సరపు కాలవేదిక మీద సాగిన మనిషి ఉద్వేగాలనూ ఆలోచనలనూ చెప్పడానికి కవులు చేసిన కళాప్రయత్నాలకు ఈ సంకలనం ఒక దర్పణం.

తక్షణ ప్రయోజనాల మీద ధ్యాసపెట్టినంతగా దీర్ఘకాలిక ప్రయోజనాల మీద ధ్యాస పెట్టకపోవడం ఇపుడున్న రాజకీయాల్లో ప్రధాన వ్యూహం. సాహిత్యం ఏకకాలంలో వర్తమానాన్నీ, గతాన్నీ, భవిష్యత్తునూ పట్టించుకుని మనిషఙకి తాత్విక దిశను చూపే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నాన్ని ఈ సంకలనంలోని పలు కవితల్లో చూడొచ్చు.

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good