జీవితమంత విస్తారమైంది కవిత్వం. వర్తమాన కాలంలో జీవితానికి అద్దం పడుతూ, వ్యాఖ్యానిస్తూ, గతాగతాల్ని తడుతూ కవిత్వం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. మిగతా ప్రక్రియలకన్నా వేగంగా అది సామాజిక చలనాలకు స్పందింస్తున్నది. సామాజిక చరిత్రకారుడు గణాంక కోణంలో మానవ జీవితాన్ని రికార్డు చేస్తుంటే, కవి సాంస్కృతిక కోణంలోంచి మానవ చరిత్రను రచిస్తున్నాడు.

సాంద్రతర రూపంలో ఉన్న కవిత్వం సమస్త జనులకూ అందకపోవచ్చు. అది ఒక పరిమితే. ఐనా దాని శక్తి అపరిమితం. మనిషిని మృదువుగా పలకరించగలదు. సౌందర్యీకరించగలదు. అదొక పార్శ్వం. అణచివేతకు గురయ్యే మనిషికి ధిక్కార స్వరాన్నిస్తుంది. ఆయుధమవుతుంది. అది మరో పార్శ్వం. కాలం కవిత్వాన్ని రచిస్తుంది. అన్ని కాలల్లో అన్ని రకాల కవిత్వ పోకడలు వర్థిల్లుతాయని చెప్పలేం. వర్థిల్లిన కవిత్వాన్ని బట్టి కాలాన్ని కొంతమేరకు అర్థం చేసుకోగలం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good