బడి ఈడు పిల్లలందరూ

బడిలో లేనట్లుగానే

కవిత్వ ఈడు పిల్లలందరూ

కేవలం కవిత్వంలోనే లేరు

వాళ్ళ స్ధలాలు వేరు, కాలాలు వేరు

ఆశ లేదు...ఆస్కారం లేదు

ఫలానారోజు కవిత్వం అంతమవుతుందనే

హామీ కూడా లేదు

1910కి 2010కి వందేళ్ళ దూరం

ఈ ఏడాది హేలీ తోకచుక్క కనపడకుండానే

ఎన్నో అనర్ధాలు జరిగిపోయాయ్‌

అయినా కవితా! ఓ కవితా!! అనే

మా కలవరింత

కన్నీళ్ళూ, రక్తమూ కలగలసిన కొత్తటానిక్‌ కోసం

మరో దశాబ్దమే కాదు

మరో మిలీనియం దాకా నిరీక్షిస్తాం

ఈ సతత హరిత ప్రస్థానాన్ని

ఇలాగే కొనసాగిస్తాం

కవిత్వం జిందాబాద్‌ అంటూ

నినదిద్దాం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good