సూటిగా చెప్పడంలో, అందంగా చెప్పడంలో ఎంత సొగసుంటుందో, ఎంత మర్మముంటుందో కవితాత్మకంగా చెప్పడంలో అంతకు మించినర మార్మికత ఉంటుంది. వర్ణవిన్యాసంలోని అనంత వర్ణ విన్యాసాలను అక్షర బద్దం చేసిన కవిమిత్రుల కవితల కదంబం 'కవిత-2005'. వేసవివేళ, వడగాడ్పులొక వంక, మల్లెల గుబాళింపు మరొకవంక.

గత సంవత్సరంలో పత్రికలలో వచ్చిన కవితల్లో మేలైన కవితలుగా ఎంచబడినవి ఈ సంకలనంలో చేర్చబడ్డాయి. పల్లె నుంచి ప్రపంచం దాకా మనిషి పలవరింత దీనిలో ప్రతిఫలించబడింది. కొత్త కాలం ఆలోచనల్లోని సామరస్యమూ, సంఘర్షణా ఈ కవితల్లో అగుపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good