మువ్వా శ్రీనివాసరావు సమాంతర ఛాయలు, 6వ ఎలిమెంట్‌ కవితలపై వ్యాఖ్యానాత్మక విమర్శ 'కవితా విపంచి'.

    హృదయనేత్రం : 

    ''ఈ సమాంతర ఛాయ'లో సర్వ కవితలూ ఉత్తమ శ్రేణికి చెందినవే. ఇది మరొకసారి చెప్పవలసిన మాట కాదు. అయినా ఈ కవిత ''ఉమ్మనీటి కన్నీరు' సర్వోత్తమమయినదే. ఇందులో నూరేళ్ళ వైవాహిక జీవితానికి తొలిపాదం వద్దనే కాచుకున్న ముల్లు అగోచరమైనవే. కానీ కవి తన సహృదయ నేత్రంతో చూడగలిగాడు. పురోహితుడు సప్తపది మంత్రోచ్ఛారణ చేసినపుడే అసలు చిక్కు మగవాడి ముందడుగుతో ప్రారంభమైందంటాడు. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నప్పుడు వరుడు చిటికిన వ్రేలితో ఆమె నరాలను మీటుతున్నాడు. ఆమె మనసు తీగలు ప్రకంపించి ఒడలంతా విశ్వత్తేజం ప్రవహించింది. ఆ అడుగులలోనే ఏడు నవ్యలోకాలను సందర్శించిన అనుభవం వధూవరులకు కలిగినా అతడు ఆమెను తొలి చూలు ఆడపిల్ల వద్దని అతని నిర్ణయం చెపుతున్నాడు. ఈ కవితలో ఎక్కడా దాంపత్య జీవితంలోని అశ్లీలత గోచరం కాకుండా ధ్వని మాత్రంగా కవితను నిర్వహించి ఆడ శిశువును కనవద్దని శాసిస్తాడు.

    చిటికెన వేళ్ళ బంధం కొడుకంటుందిట

    బొటనవేళ్ళ బంధమయితే ఆడకూతుర్నిస్తుందిట

    మగస్వామ్యం జూలు విదిల్చి

    భావ దారిద్య్రం జడలు విప్పిందక్కడే.

    హక్కుల్లో సగభాగం వస్తోందో రాదో

    ఆకాశంలో సగం కాస్తా పాతికయిందిప్పటికే!

    ఈ కవితలో కవి చెప్పినదానికన్నా మన హృదయావగాహనకి అవకాశం ఇచ్చిందెక్కువ. ఎన్నో విషయాలు ధ్వనిచేయకుండా వీణా నిక్వణానుభూతిని ఒక మీటుతో వదిలి పెడతాడు. కనుకనే మరింత వ్యాఖ్యానం అవసరమవుతుంది. మన జాతి ఎన్ని అత్యుత్తమ కవితల్ని నిర్మించుకున్నా సరైన వ్యాఖ్యానం లేక మన అవగాహనా తలంపై సజీవంగా పరుచుకోలేకపోయాయి.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good