ఇప్పుడు కవిసేన మేనిఫెస్టో అవసరం!

కవిసేన మేనిఫెస్టో

ఆధునిక కావ్య శాస్త్రమ్‌

కవుల అవిరళ కృషే మానవత్వాన్ని నిలబెడుతూ వచ్చింది... ఏ తరానికి ఆ తరం కొత్త కవుల్నీ కొత్త భాషనీ కొత్త విలువల్నీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించుకుంటుంది. కవి గొంతు ఒక శాశ్వత నైతిక శంఖారావం. విశిష్టంగా చెప్పబడిన మాటే కవిత్వం కాగలదు. ఆ మాటకే మనిషిని మార్చే శక్తి ఉండగలదనేది అక్షరసత్యం.

అభ్యుదయం అంటే అధికార్ల పాదసేవ కాదు - దాన్ని తిరస్కరించడం...ఈ మాటలు సత్యాలు కావా? కవిస్థానం మహోన్నత మంటూనే కవిత్వ రాజకీయాలను ఎండగడుతూంటే ఆలకించాలి గదా! ''తెలుగుదేశంలో నూతన అధ్యాయం తెరవాలి. అంటే కొత్త కవిత్వం రాసి, మంచి కవిత్వం ఎరగని అకవుల చేతల్లో వంచితమైన తెలుగుదేశానికి నిజమైన కవిత్వం ఇవ్వాలి'' అనడం కవిత్వాభిమానమే! ఇటువంటి లక్ష్యాలతో, తెలుగు కవిత్వాన్ని కవిత్వమయం చేయడానికి శేషేంద్ర మానస పుత్రిక ''కవిసేన'' పుట్టింది. 1977లో కవిసేన మేనిఫెస్టో విడుదలైంది. (చిత్రం ఏమిటంటే మేనిఫెస్టో రాజకీయ పార్టీలకు సంబంధించనిది కావటం!). ప్రామాణికతతో, సాక్ష్యాలతో తన ఆలోచనలను 'నివేదించాడు, చర్చకు' పెట్టాడు. రాజకీయ కవులు ఎవర్ని ఉదాహరిస్తారో వారితో తన వాదనలను సమర్థించుకోవటం శేషేంద్ర ప్రతిభకి మచ్చుతునక. ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో కవిత్వం అధ్యయనం చేసి లోకానికి అన్వయించి అక్షరార్చన చేయగా ఆవిర్భవించిందే ''కవిసేన మేనిఫెస్టో'!.

ప్రాచీన సంస్కృత గ్రంథాల నుండి, ఆధునిక అలంకారికుల రచనల వరకు 62 ప్రామాణిక గ్రంథాల పరిశీలనతో శేషేంద్ర రచించిన ఈ సంచలన గ్రంథం సాహితీ సమరాంగనంలోకి ప్రవేశించే కవి చేతిలో కరవాలమే.

Pages : 254

Write a review

Note: HTML is not translated!
Bad           Good