కవికొండలవారు కథలలో ''కూలియన్న'ల బ్రతుకులను, జీవిత సత్యాలను, ఆనాటి సమస్యలను సున్నితమైన హాస్యంతో వ్యంగ్య ప్రధానంగా ప్రదర్శించినారు. మామూలు సంఘటనలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి వైచిత్రి ప్రధానంగా కొన్ని కథలు వ్రాసారు. అటువంటి కథ ''కంఠధ్వని'' - 15-08-1953వ తేది రాత్రి రాజమహేంద్రవరంలో సంభవించిన గోదావరి వరద గురించి. ఈ కథ సెప్టెంబర్‌ 1953 ''భారతి'' పత్రికలో ప్రచురింపబడింది. ఆ రోజులలో వీరి కథలు ప్రముఖ పత్రికలైన కృష్ణాపత్రిక, భారతి, వినోదిని, ఆనందవాణి, ఆంధ్రభూమి, ఢంకా, ఆంధ్ర శిల్పి, ఆంధ్రపత్రిక, మానవసేవ, దేశ సేవ మొదలైన పత్రికలలో పోటాపోటీగా ప్రచురించబడినవి. - కవికొండల వెంకట సూర్యనారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good