భూతకాలపు అలవాట్లూ, ఆచారాలనుంచి, భావికాలపు ఆదర్శాల నందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమానకాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.

అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూఉంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. అతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్థస్థితి అతని నడుగడుగునా వేధిస్తుంది. అతడు అడుగు పెట్టిన వంతెన మామూలు వంతెనకాదు, కత్తుల వంతెన!

కాని ఆ కత్లువాడీ, వంతెన నిడివీ అతని ఆ వేగోద్వేగాల్ని నిలవరించలేవు. మందంగానో, దురితంగానో అతని అడుగు ముందుకే, మున్ముందుకే.

Pages : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good