చిట్టి కథకి మొదలు, ముగింపు రెండూ ముఖ్యమే;

    కానీ వాటిలో మొదటిది కాస్త ఎక్కువ ముఖ్యం. ఎందుకు?

    మీ కథకి పేరు పెట్టడం ఎలా?

    ముగింపు తేలిపోతే మీ కథ పేలిపోయినట్లేనా?

    మీ కథకి సరిపడే దృక్కోణాన్ని ఎలా ఎంచుకోవాలి?

    సహజమైన సంభాషణలు రాయడం ఎలా?

    మీ పాత్రలు వాస్తవికంగా అనిపించాలంటే వాటి చిత్రణలో కాస్త అతిశయం తొంగి చూడాలి. ఎందుకు?

    కథా నిర్మాణం అంటే ఏమిటి?

 

    ఇందులో అనిల్‌ ఎస్‌.రాయల్‌ 'కథ ఇలాగే రాయాలి....' అని చెప్పడం లేదు. 'నేనైతే ఇలా రాస్తాను' అని మాత్రమే చెబుతున్నాడు. ఒకవేళ అతను 'ఇలాగే రాయాలి' అని చెప్పినా దాన్ని నేను వ్యక్తిగత అభిప్రాయంగానే చూస్తాను. అనిల్‌లాగే ప్రతి రచయితా తాను కథలెలా రాస్తాడో నిజాయితీగా వివరిస్తే దారి దొరక్క ఇబ్బందిపడుతున్న ఉత్సాహిక కథకులకు కాసింతైనా వెలుగు చూపినట్టవు తుంది. ఈ 'కథాయణం'లో ఒప్పులుండొచ్చు, తప్పులుండొచ్చు, పరిధులుండొచ్చు, లేకపోనూవచ్చు. నొచ్చుకోకుండా దీన్ని ఒక గమనించదగ్గ ప్రయత్నంగా చూడాలి. - వేంపల్లి షరీఫ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good