వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేల సంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారింది!

ఈ ప్రశ్నలకు సమాధానమే ''ఈతరం కోసం.... కథాస్రవంతి''.

తెలుగుకథను సుసంపన్నం చేసిన అగ్రశ్రేణి రచయితల రచనల నుండి 10 గొప్ప కథలను ఎంపిక చేసి, ఆయా రచయితల జీవితం, సాహిత్యంపై వివరణలతో, నేటి మంచి రచయితలు, విమర్శకులు సంపాదకులుగా అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ 10 కథా సంపుటాలను 'కథాస్రవంతి-1'గా గతంలో అందించింది. ఈ కథా సంపుటాలు పాఠకుల ఆదరణను, విమర్శకుల మన్ననలను పొందాయి. మరింతమంది రచయితల సంకలనాలను అందించమనే సూచనలూ వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ''రెండవ విడత''గా ''కథాస్రవంతి - 2''గా 11 మంది మంది ఉత్తమ రచయితల, 11 కథా సంపుటాలుగా 2016లో పాఠకుల ముందుకు తీసుకొచ్చింది అరసం. అదేబాటలో పయనిస్తూ ఇప్పుడు 'కథాస్రవంతి-3'లో 10 మంది గొప్ప రచయితల కథలను 10 సంపుటాలుగా వెలువరించింది.

ఈ 'కథాస్రవంతి-3'లో ప్రముఖ రచయితల పేర్లు...

1. గోపీచంద్‌ కథలు

2. రావిశాస్త్రి కథలు

3. మా. గోఖలే కథలు

4. కలువకొలను సదానంద కథలు

5. తాడిగిరి పోతరాజు కథలు

6. భూషణం కథలు

7. కె. వరలక్ష్మి కథలు

8. అట్టాడ అప్పల్నాయుడు కథలు

9. మధురాంతకం నరేంద్ర కథలు

10. వల్లూరు శివప్రసాద్‌ కథలు

అరసం అందిస్తున్న 'కథాస్రవంతి-3' సబ్సిడి ధర కేవలం రూ. 500 (ఎం.ఆర్‌.పి. 605)

Write a review

Note: HTML is not translated!
Bad           Good