11

 కధా సంపుటాలు

 మంది రచయితలు

 

వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో  ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలాఅన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారింది!

ఈ ప్రశ్నలకు సమాధానమే ఈతరం కోసం కథాస్రవంతి’’

తెలుగు కథను సుసంపన్నం చేసిన అగ్రశ్రేణి రచయితల రచనల నుండి 10 గొప్ప కధలను ఎంపిక చేసి, ఆయా రచయితల జీవితం, సాహిత్యంపై వివరణలతో, నేటి మంచి రచయితలు, విమర్శకులు సంపాదకులుగా అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ సబ్సిడీ ధరతో 10 కథా సంపుటాలను, గత సంవత్సరం అందించింది. ఈ కధాసంపుటాలు పాఠకుల ఆదరణను, విమర్శకుల మన్ననలను పొందాయి. మరింతమంది రచయితల సంకనాలను అందించమనే సూచనలూ వచ్చాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రెండవ విడతగా, 11 మంది ఉత్తమ రచయితల, 11 కధాసంపుటాలను 2016 మే 1 , తిరుపతిలో "అరసం" ఆవిష్కరించ బోతున్నది...

మల్టీ కలర్ లో, మంచి పేపర్ తో అత్యంత తక్కువ ధరలో ఈతరం  కోసం కథా పరిమళాలు .........

రచయితల పేర్లు

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి                                             సింగమనేని నారాయణ

అబ్బూరి ఛాయాదేవి                                                 ఆర్. వసుంధరా దేవి

బోయ జంగయ్య                                                      డా.పాపినేని శివశంకర్

శ్రీపతి                                                                    ముదిగంటి సుజాతారెడ్డి

పూసపాటి కృష్ణం రాజు                                               అంపశయ్య నవీన్

ఎ.ఎన్.జగన్నాధ శర్మ


మండు వేసవిలో మంచి కథా పఠనంతో సేదదీరుదాం …..రండి.

అరసం అందిస్తున్న 11 మంది ఉత్తమ రచయితల, 11 కధాసంపుటాల సెట్ సబ్సిడి ధర రూ. 550/-

Write a review

Note: HTML is not translated!
Bad           Good