కథానికా శాస్త్రం

అక్షరాల విలువ తగ్గి అంకెల ప్రాధాన్యత పెరిగిన వర్తమానంలో మానవీయ సాహిత్య సృజన ఆవశ్యకత మరింత పెరిగింది. అందుకు చదువరులు రచయితలుగా మారాల్సిన అవసరం మరింత పెరిగింది. అలా జరగాలంటే నిర్దుష్టమైన సామాజిక దృక్పథం, నిబద్ధత గల తాత్విక భూమిక వారికి అవసరం. అప్పుడే వారు సమాజాన్ని, జీవితాన్ని విమర్శించే, వ్యాఖ్యానించే, కళాత్మకంగా రూపొందించే శక్తిని పొందుతారు.  ఆ అవసరాన్ని గుర్తించి 2014 డిసెంబర్ 26-28 తేదీలలో గుంటూరులో  కథానికా ప్రక్రియపై నిర్వహించిన "కధానికా పాఠశాల" పాఠాలతో పాటు, ఆ ప్రక్రియపై పరిచయం అవసరం లేని పలువురు ప్రసిద్ధుల వ్యాసాలను అనేక పుస్తకాలనుండి స్వీకరించి ఈ సంకలనాన్ని రూపొందించాం.

అంతర్జాతీయ స్థాయికి చేరిన తెలుగు కథానికా ప్రక్రియకు అరసం అందిస్తున్న ఒక అపురూప కానుకైన ఈ వ్యాస సంకలనం ఒక శాస్త్రీయ కథానికా శాస్త్రం. కథానికా పాఠ్యగ్రంథం. కొత్తగా రచనలు చేయాలనుకునేవారికి, చేసేవారికి, చేస్తున్నవారికి ఒక కరదీపికగా వెలుగు లందిస్తుందని మా ఆశ.

- వల్లూరు శివప్రసాద్‌

  ప్రధాన కార్యదర్శి

  ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం

వ్యాస రచయితలు :

 డా|| కాత్యాయనీ విద్మహే, కొడవటిగంటి కుటుంబరావు, మధురాంతకం రాజారాం, కోడూరి శ్రీరామమూర్తి, డా|| రాచపాళెం చంద్రశేఖరరెడ్డి,  శీలా వీర్రాజు, ఆచార్య మేడిపల్లి రవికుమార్‌, డా|| కేతు విశ్వనాథరెడ్డి, డా|| పాపినేని శివశంకర్‌, డా|| పోరంకి దక్షిణామూర్తి, కె.పి.అశోక్‌కుమార్‌, డా|| మధురాంతకం నరేంద్ర, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, విహారి, సింగమనేని నారాయణ, కాళీపట్నం రామారావు, డా|| చందు సుబ్బారావు, ఆరుద్ర.

Pages : 182

Write a review

Note: HTML is not translated!
Bad           Good