విరసం కథా వర్కుషాపులు నిర్వహించి ఆ వర్క్‌షాపుల్లో చదివి పరిష్కరించుకున్న కథలను సంకలనంగా తెస్తున్నది. ఈ వరసలో ఇది మూడవ రచయితల సమిష్టి సేద్యపు కథల పంట. ఈ వర్కుషాపుల నిర్వహణలో రాష్ట్ర వ్యాపితంగా ఉన్న విరసం రచయితలతోపాటు మిత్ర రచయిత/త్రులు-ఏ ప్రాంతంలో నిర్వహిస్తే అక్కడి వాళ్లు పాల్గొంటున్నారు. ఈ వర్కుషాపుల వలననే కథకు సంబంధించిన విస్తృతి, అధ్యయనం పెరిగి-ప్రాంతాలవారిగా, జిల్లాలవారిగా కథా సాహిత్యం సేకరణ, అధ్యయనం ముందుకు వచ్చాయి.

    ఈ పందొమ్మిది కథల్లో సాంప్రదాయక పద్ధతితోపాటు-భిన్నంగా, గతితార్కికంగా, మూలాల్లోకి వెళ్ళి ఆలోచించే కథలు ఉన్నాయి. ఇది ఒక రకంగా విప్లవ కథా సాహిత్యంలో ఒక గుణాత్మకమైన మార్పు. సమిష్టి అధ్యయనం ద్వారా నేర్చుకోవడం కథల్లో కనిపిస్తుంది. కొత్త కథా ఆవరణంలోకి ముఖ్యంగా, ఎక్కువగా రచయిత్రులు ప్రవేశించి కథను పరిపుష్టం చేయడం ఈ సంకలనంలో కనిపిస్తుంది. - అల్లం రాజయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good