కథ, నవల, సాహిత్యం, కళలు జీవిత సత్యాలను తెలపాలి. ఆహ్లాదకరమైన ఊహలను, అందమైన ప్రపంచాన్ని కలగనేట్టు ఊహల్ని అందించాలి. కఠోర వాస్తవాలను తెలపాలి. మనిషిని ఆశవైపు, అభివృద్ధి వైపు, మానవీయ విలువల వైపు నడిపించాలి. ఒక నూతన మానవీయ ప్రపంచాన్ని ఊహల ప్రపంచాన్ని అనుభూతి చెందాలి. అనుభవించాలి. కఠోర జీవితం నుండి, చీకటి నుంచి తిరిగి వెలుగులోకి ప్రస్ధానం సాధ్యమేనని నమ్మకం కలిగించాలి. తోటి మానవుల కష్టాల పట్ల, కన్నీళ్ల పట్ల, స్పందింపచేయాలి. కళలు, సాహిత్యంలోని ఆనంద, విషాదాలు, ప్రేమ, స్నేహం, కరుణ, భయం, తమవిగా భావించి లీనం కావాలి. అలాంఇ సాహిత్యం, కళలే గొప్ప సాహిత్యం, కళలుగా చెప్పవచ్చు.

సాహిత్య ప్రయోజనాన్ని మనసా వాచా కర్మణా ఆచరించే రాములు గారి ఈ ప్రయత్నాన్ని మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన నుంచి ఇంకా వినూత్నమైన ఆధునిక సాహిత్యాలంకార శాస్త్రాన్ని మనం ఆశించడం ఆయన తీర్చగలిగే కోరిక అని నమ్ముతూ ఈ పుస్తకంలోని అడుగు పెట్టమని ఆహ్వానిస్తున్నాను. - డా|| విద్యాసాగర్‌ అంగలకుర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good