అంతరించిపోతున్న పిచుకలు, చెరువులు, ముంపుబారిన పడ్డ బతుకులు, అడవులు ఆక్రమణలు, సాంప్రదాయ విజ్ఞానం మొదలైన అంశాలన్నీ ఈ కథలలో ఉన్నాయి. అన్నీ ఒకేసారి చదవడం వల్ల ఇప్పుడు జరుగుతోన్న హాని ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. దాన్ని ఈ రచయితలు చెప్పగలిగేరు. ఇంకా మరిన్ని పర్యావరణ కథలు వీరు రాయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరికి Ecological Services గురించిన అవగాహన ఉంది. అసలు మనది జీవావరణ సంస్కృతి. దీన్ని జ్ఞాన సిద్ధాంతాలతో విశ్లేషిస్తే పూర్తిగా అవగతం కాదు. సంస్కృతికి తార్కాణం - ఆ జాతి ప్రాపంచిక దృక్పథం. దాన్ని బట్టి ఆ జాతి కళా సాహిత్యాలు ఊపిరి పోసుకుంటాయి. సాంస్కృతిక ఔన్నత్యం ఆ జాతి బుద్ధి వివేకాల మీద ఆధారపడి ఉంటుంది.
- తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి

Write a review

Note: HTML is not translated!
Bad           Good