"ఈ రోజు వాటాదారుల మీటింగ్ ఉంది. రావటం ఆలస్యమవుతుంది" ఆఫీసుకు కారెక్కుతూ అన్నాడు అతడు. అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. ఎవరైనా పట్టించుకుంటారని అతడు అనుకోనూ లేదు. చెప్పటం అలవాటు కనుక, చెప్పాడు అంతే! కారెక్కి కూర్చున్నాక ఒకసారి వెనక్కు తిరిగి ఇంటివైపు చూసాడు. భార్య, చిన్నమ్మాయి పాపకి గోళ్ళు కత్తిరిస్తోంది. అమ్మాయి తోటలో పని చేసే మాలిపై అరుస్తోంది. పెద్దకోడలు ఇంటి మెట్లపై కూర్చుని సినిమా పత్రిక తిరగేస్తోంది. రెండో కొడుకు రేడియోలో, ప్రసారమయే క్రికెట్టు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నాడు. ఏ ఒకరు అతని వైపు చూడలేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good