2011 కథల్లోని వివిధ పాత్రల ప్రాతినిధ్యాలలో ఈ రాజకీయ, సైద్ధాంతిక కోణం చాలా బలంగా కనిపిస్తుంది. పైన పేర్కొన్న పద్ధతుల్లో ఏ రకం వాస్తవికత కథలో వున్నా, వాటిలో ఈ కోణం బలంగానే కనిపిస్తుంది. ఈ కోణానికి అతీతంగా నిలబడి కథ చెప్పే స్థితి కనీసం ఈ 2011లో లేదు. భూమి సమస్య అయితే అది ప్రాంతీయ రాజకీయాల్ని, స్త్రీ సమస్య అయితే జెండర్‌ పాలిటిక్స్‌ని, మైనారిటీ సమస్య అయితే అది మైనారిటీ రాజకీయాల్ని ప్రస్తావించకుండా కథ చెప్పడం అసాధ్యమే. అంటే, కథ వాస్తవ చిత్రణ నించి వాస్తవికత మీది వ్యాఖ్యానం (ఇంటర్‌ప్రిటేషన్‌) దాకా ప్రయాణించింది. ఈ కొత్త వ్యాఖ్యాన పద్థతి కూడా మనం ప్రపంచ సాహిత్యంతో తెలుగు స్థానికతకి ఏర్పడిన అనుబంధం వల్లనే సాధ్యపడింది.

    2011 కథల్లో మూడు అమెరికాలు కనిపిస్తాయి. వొకటి: నిజంగానే భౌగోళికమయిన అమెరికా, రెండు : అమెరికాలోని తెలుగుదనం, మూడు : మన రాష్ట్రంలో నగరీకరణ, సాంకేతీకరణలో భాగంగా సృష్టించుకుంటున్న ''అమెరికా'' అనే ఊహ. నిజానికి ఈ మూడు అమెరికాలు మూడు భిన్న కోణాలు. నాకు అర్థమయినంత మటుకు ఇందులో మూడో ''అమెరికా'' - అమెరికా సంస్కృతి పేరిట మనం అతికించుకుంటున్న కొత్త ముఖం, మన పాజిటివ్‌ అతర్ముఖీనతని/ స్థానికతని మటుమాయం చేస్తున్న ఆర్థిక కనికట్టు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good