విమర్శలకు అతిగా స్పందించకుండా, దానిలోని మంచి చెడ్డలను సహనంతో తరచిచూడవలసిన బాధ్యత కథకులపైన వుంది. నిజానికి కఝథా సాహిత్యసింహావలోకనాల్లోనూ, విమర్శల్లోనూ పేర్కొనడమంటే ఆయా రచనలకు సాహిత్య స్థాయివున్నట్టే లెక్క. యిప్పుడు ప్రతి సంవత్సరమూ వివిధ పత్రికల్లో రకరకాలుగా వస్తున్న కథల్ని లెక్కగడితే అవి రెండువేల వరకూ వుండవచ్చు. అయితే చదవ తగిన కథల దగ్గరికొచ్చేసరికి సంఖ్య అందులో సగమవుతోంది. తప్పకుండా పట్టించుకోవల్సిన కథల దగ్గరికొచ్చే ఆ సంఖ్య రెండువందల దగ్గరికొస్తుంది. యిప్పుడు మనం ఆలోచిస్తున్నది యీ రెండువందల (సుమారుగా) కథలగురించే! మరింతగా కృషి చేస్తే యీ కథకులు మరింత పరిణితిని పొందుతారు. కథా రచయితలు సాహిత్యాన్నీ, విమర్శనా సూత్రాలను గూడా అధ్యయనం చేయాలి. జీవితాన్ని పరిపూర్ణంగా సాహిత్యంలో ఆవిష్కరించడం యెంత కష్టమో, వో కళావిష్కరణను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడమూ అంతేకష్టం. వొక కథానికను విశ్లేషించడానికి చాలా విధానాలుంటాయి. వో రకంగా చేసిన విశ్లేషణపైన మరోరకపు విమర్శకులకు కనీసం సహనం, వివేచన వుండాలి.

- మధురాంతకం నరేంద్ర

Write a review

Note: HTML is not translated!
Bad           Good