2000వ సంవత్సరంలో ప్రారంభించిన కథావార్షిక ప్రచురణల పరంపరలో యిది యెనిమిదవ సంకలనం. 2002లో మా సంస్థ సమకాలీన కథా సాహిత్యంపైన సింహావలోకనంతో బాటూ వొక సాధికారమైన చర్చను గూడా నిర్వహించింది. అందులో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, అంపశయ్య నవీన్‌, ఓల్గా, స్వామి, కె.శ్రీనివాస్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గార్లు పాల్గొన్నారు. ఆ తరువాతి కాలంలో కథావార్షికలో మేము యింటర్వ్యూలను, కథారూపక సంపాదకీయాలను గూడా ప్రచురించాం. ఆరేళ్ళ తర్వాత యీ సంవత్సరం మళ్లీ యిప్పుడు చర్చను కొనసాగించాము. నేటి ప్రముఖ విమర్శకులు గుడిపాటి, వాడ్రేవు చినవీరభద్రుడు, బి.తిరుపతిరావు పాల్గొన్న యీ చర్చను మా సాహిత్యసంస్థ యథాతథంగా పాఠకులకు సమర్పిస్తోంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good