వార్షిక కథాసాహిత్య సింహావలోకాల్లో యిది రెండవది.

    తెలుగు కథల్లో దళిత జీవన చిత్రణతోబాటుగా - మైనారిటీల జీవన సరళిని కూడా చిత్రించడం యిటీవలి పరిణామం. ముఖ్యంగా ముస్లిము మైనారిటీల జీవన శైలికి అద్దం పట్టే కథలు యిటీవల ఎక్కువగా వస్తున్నవి. వీటిల్లో గుర్తుంచుకోదగ్గ కథలు కూడా వుంటున్నవి.

    ఒకప్పుడు ముస్లిము రచయితలు కథలు రాసేటప్పటికీ - వారు మిగతా రచయితలు నడిచిన దోవలేనే నడుస్తూ, వారందరూ రాసే కథల వంటివే తమూ రాసేవారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఒక ముస్లిమ్‌ రచయిత్రి ప్రచురించిన కథా సంకలనంలో ముస్లిమ్‌ల జీవితాన్ని గురించి చెప్పే కథ ఒక్కటీ లేక పోవడం గమనించదగ్గది. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు.

    ఈ ఏడాది వచ్చిన సుల్తానా, దస్తర్‌, (స్కైబాబ), మున్నాబేగం (ఖలందర్‌), మన్నత్‌ (యాకూబ్‌), మొదలయిన కథలు - జవా, నయాఫత్వా ( ఎం.హరికిషన్‌) వంటి కథలు - ఈ సందర్భంలో పేర్కొనదగ్గవి.

    'మన్నత్‌' కథలో ముత్యాల గూడెం జ్యాపాట సైదులుకు మొక్కి జెండా ఎత్తి 'మన్నత్‌'లు చేసుకోవడము, దారిద్య్రం ఎంత పీడిస్తున్నా 'మన్నత్‌'లు మానక పోవడమూ వుంటే -

    ''జవా'' కథలో మసీదుకు చెందిన ఆస్తిపాస్తులను అనుభవిస్తూ మసీదు అభివృద్ధికి ఎంత మాత్రమూ తోడ్పడని ముల్లాలు - 'పెద్దబుక్కు' చదివినవారు చేయాల్సిన 'జవా'ను గౌండ అయిన రసిక్‌ చేశాడు. కాబట్టి అతడికి వెయ్యి రూపాయలు జుల్మానా వెయ్యడము - పాత కక్షలు మనసులో పెట్టుకుని ''-ఈ రోజొకడు 'జవా' చేస్తానంటాడు. మరొకడు 'నిఖా' సేస్కుంటానంఆడు-'' అంటూ ఆ పద్దర్మ పరిస్థితుల్లో కోడి కోసిన రసిక్‌ పై మండిపడడమూ-

- యిలాంటివన్నీ వేర్వేరు రూపాల్లో వేర్వేరు సందర్బాల్లో పిడివాదాన్ని బుర్రకు పట్టించుకున్న అన్ని మతాల్లోనూ వుండేదే!-...

Write a review

Note: HTML is not translated!
Bad           Good