సృష్టి

ఒక్క క్షణం విస్తుబోయింది శోభాంజలి. తను విన్నది నిజమేనా?.. సరిగానే విన్నావా? అన్న అనుమానం కలిగింది కొద్దిక్షణాలు తలెత్తి ఋషి ముఖంలోకి చూసింది. తను చెప్పవలసింది చెప్పేసి, ఆమె జవాబు కోసం ఎదురుచూస్తున్న కవళికలేవీ లవలేశంగానైనా కనిపించటంలేదు ఋషి ముఖంలో. చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉన్నాడతను.

ముఖ్యంగా అతని కళ్ళు... ఏవేవో లోకాలని దాచుకున్నట్టు కనిపించే అతని కళ్ళు. ఒక్కక్షణంపాటు రెప్పకొట్టినా ఏవో సుందర స్వప్నాలు వెలిగి ఆరిపోతున్నాయన్న భావన కలిగించే అతని కళ్ళు... ఓ మహా కళాకారుడి సునిశితత్వాన్ని, సున్నితత్వాన్ని పాపలుగా మార్చుకున్న అతని కళ్ళు - ఆ కళ్ళల్లోకి చూస్తూ మంత్ర ముగ్థలా నెమ్మదిగా అదురుతున్న పెదవుల్ని కుదురుకి తెచ్చుకొని చెప్పిందామె.

''మీ షరతు నాకిష్టమే...''

మరో వారం రోజుల తరువాత శోభాంజలి, ఋషిల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది.

''శోభాంజలికి శోభనమోచ్‌'' - పరిమళ అరుపు మరెవ్వరికైనా వినపడిందేమోనని హడలిపోయింది శోభాంజలి. ''అబ్బ ఇంత సిగ్గులేకుండా ఎలా ఐపోయావ్‌ ఒదినా!?'' పరిమళను సుతారంగా విసుక్కుందామె.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good