ఇది కథలకు కాలం కాదన్నప్పుడు ఈ సంకలనాలను ప్రచురించటం మొదలు పెట్టాం. రచయితలు తమకు వేదిక దొరికిందని, పాఠకులు మంచి కథలు చదవ గలుగుతున్నామని సంతోషించారు. అలా 1991లో కథ 90తో ప్రారంభమయిన ప్రయాణం ఇరవై మూడేళ్ళుగా నిరంతరాయంగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొంతకాలం ఎన్నో కథల నుంచి కొద్ది కథలను మాత్రమే ఎంచుకోవడం కష్టమయింది. మరికొత కాలం మంచి కథలు దొరకడమే కష్టమయింది. ఇలా కథా సాహిత్యంలో ఆటుపోట్లు ఉన్నట్లే మా ప్రచురణ తేదీల్లోనూ ఆటుపోట్లు ఉన్నాయి. కొన్ని సంకలనాలు మరీ నవంబర్, డిసెంబర్లలో వెలువడిన సందర్భాలూ ఉన్నాయి. మొత్తంమ్మీద ప్రయాణం ఆగలేదు. సాగుతూనే ఉంది. సాగుతుంది కూడా. 151 మంది రచయితలు 311 కథలతో చేసే కరచాలనం ఈ కథా సంకలనాల పరంపర.
కథాసాహితి ప్రచురించిన ఈ కథ సీరిస్‌లోని అన్ని పుస్తకాలు ఎప్పుడో ప్రింట్ అయిపోయినవి. ఆనంద్బుక్స్.కామ్ పాఠకుల కోసం లభ్యమైన 10 పుస్తకాలను అందుబాటులో వుంచుతున్నాం. ఈ పది పుస్తకాల వివరాలు....
1. 'కథ - 95'లో అతడు - అల్లం రాజయ్య, ప్రయాణం - పి.చంద్రశేఖర అజాద్, జీవన్ముృతుడు - ఆడెపు లక్ష్మీపతి, వి.డి.ఆర్.ఎల్. - కుప్పిలి పద్మ, పిలకలతిరుగుడు పువ్వు - కె.యన్.వై. పతంజలి, రెండునదుల మధ్య - ముళ్ళపూడి సుబ్బారావు, పండుటాకు - కాట్రగడ్డ దయానంద్, మురళిఊదేపాపడు - దాదా హయాత్, చింతలతోపు - పాపినేని శివశంకర్, చీకటి - అల్లం శేషగిరి రావుల 10 కథలు పొందుపరచబడ్డాయి.
2. 'కథ - 97'లో ఓ తోట కథ - అట్టాడ అప్పల్నాయుడు, గొడ్డ దొంగ - కొలకలూరి ఇనాక్, యుద్ధభూమి - కాలువ మల్లయ్య, మెరుగు - బి.యస్.రాములు, చిట్టచివరి రేడియో నాటకం - డా|| వి.చంద్రశేఖర రావు, మెడ మీద వేలాడే కత్తి - శ్రీనివాసమూర్తి, దావత్ - మహమ్మద్ ఖదీర్ బాబు, మెగుడూ పెళ్ళాల ప్రేమ కత - ఆర్.యమ్. ఉమామహేశ్వర రావు, నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద - నాగప్పగారి సుందర్ రాజు, రెప్పచాటు ఉప్పెన - సి.సుజాత వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు రచయితల పరిచయం కూడా పొందుపరచబడింది.
3. 'కథ -2000'లో కానుగపూల వాన - గోపిని కరుణాకర్, కన్నీటి కత్తి - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, వలసపక్షి - పెద్దింటి అశోక్‌కుమార్, ఇన్స్టంట్ లైఫ్ - కుప్పిలి పద్మ, మూడవ అధ్యాయం - శ్రీకాంత్, గట్టు తెగిన చెరువు - ఆరి సీతారామయ్య, కిటికీ - సరికొండ చలపతి, మగాడి పశ్చాత్తాపం - అనిసెట్టి శ్రీధర్, గుండె లోతు - సాహితి, వైరస్ - ఎమ్వీ రామిరెడ్డి, అహింస - నవులూరి వెంకటేశ్వర రావు, విధ్వంస దృశ్యం - ఆడెపు లక్ష్మీపతి, నోరుగల్ల ఆడది - ఆర్.యమ్.ఉమామహేశ్వర రావు, న్యూ బాంబే టైలర్స్ - మహమ్మద్ ఖదీర్ బాబు వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు కాత్యాయనీ విద్మహే యొక్క ఈ దశాబ్ది తెలుగుకథ సమీక్షా వ్యాసం, కథలు - కథకులు, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
4. 'కథ - 2001'లో అవచారం - ఆరి సీతారామయ్య, కప్పడాలు - తోలేటి జగన్మోహనరావు, దూరపు కొండలు - నల్లూరి రుక్మిణి, నిశ్శబ్ద విప్లవం - జి.ఉమామహేశ్వర్, సాలభంజిక - కుప్పిలి పద్మ, ఖాదర్ లేడు - మహమ్మద్ ఖదీర్‌బాబు, కొలీగ్స్ - చంద్రలత, నిశ్శబ్దం! నిశ్శబ్దం!! - ముదిగంటి సుజాతారెడ్డి, సంకెళ్ళు - వి.అశ్వినికుమార్, వలస - ఇనయ్‌తుల్లా, టైటానిక్ - సురేష్, అస్తిత్వానికి అటూ-ఇటూ - మధురాంతకం నరేంద్ర, నీడ - సుంకోజి దేవేంద్రాచారి, గోస - పెద్దింటి అశోక్‌కుమార్, పాటపబండి - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పేగుముడి - కె.దేవయాని, నేల తిమ్మిరి - కాట్రగడ్డ దయానంద్, బతుకు - కన్నెగంటి చంద్ర వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి యొక్క పదేళ్ళ క'కథాసాహితి' కథానిక నిర్మాణ పద్ధతులు వ్యాసం, కథలు - కథకులు - 12 సంకలనాల కథల సూచి, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
5. 'కథ - 2002'లో ప్రశ్నభూమి - వాడ్రేవు చినవీరభద్రుడు, నిచ్చెన - ఇనాయతుల్లా, పెండెం సోడా సెంటర్ - మహమ్మద్ ఖదీర్‌బాబు, నిత్య గాయాల నది - బెజ్జారపు రవీందర్, గుండ్లకమ్మ తీరాన - కాట్రగడ్డ దయానంద్, చూపు - కమలకుమారి, అన్నంగుడ్డ - సుంకోజి దేవేంద్రాచారి, రాచపుండు - వి.ప్రతిమ, ఒక చల్లని మేఘం - డా|| యం.హరికిషన్, నిశ్శబ్దపు పాట - శ్రీకాంత్, ఆవర్జా - చంద్రలత, ఆవు-పులి మరికొన్ని కథలు - డా|| వి.చంద్రశేఖర రావు, గోరీమా - అఫ్సర్ వంటి రచయితల కథలతోపాటు కె.శ్రీనివాస్ యొక్క తెలంగాణ కథా చరిత్ర - కొన్ని సమస్యలు' అనే వ్యాసం, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
6. 'కథ - 2005'లో కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం - జాన్సన్ చోరగుడి, కొమ్మిపూలు - సుంకోజి దేవేంద్రాచారి, బైపాస్ రైడర్స్ - బాషా. జి, పరమవీరచక్ర - సువర్ణముఖి, బతికి చెడిన దేశం - అట్టాడ అప్పల్నాయుడు, కింద నేల ఉంది - మహమ్మద్ ఖదీర్‌బాబు, రాతి తయారి - కె.ఎ. మునిసురేష్ పిళ్ళై, నెమలినార - బి.మురళీధర్, బృంద - కాశీభట్ల వేణుగోపాల్, జ్ఞాతం - వినయమూర్తి, ఆసరా - వారణాసి నాగలక్ష్మి, వీరనారి - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రెండంచుల కత్తి - కె.ఎన్.మల్లీశ్వరి వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి రాయలసీమలో కథా విస్తరణ వ్యాసం, కథలు - కథకులు - 16 సంకలనాల కథల సూచి, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
7. 'కథ - 2008'లో గాంధీగిరి - తోలేటి జగన్మోహన రావు, ఊరు గోదారి - అద్దేపల్లి ప్రభు, అసందిగ్ధ కర్తవ్యం - ఆడేపు లక్ష్మీపతి, నమ్మకం - మధురాంతకం నరేంద్ర, కొలిమి - కొలకలూరి ఇనాక్, మాయ - గంటేడ గౌరునాయుడు, రూపాయి చొక్కా - ఎస్.శ్రీదేవి, రామల్లి - గూళూరు బాలక్రిష్ణ మూర్తి, పందెపు తోట - అట్టాడ అప్పల్నాయుడు, సెగ లోగిలి - సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి, యు.ఎఫ్.ఓ. - బి.అజయ్ ప్రసాద్, క్రానికల్స్ ఆఫ్ లవ్ - డా|| వి.చంద్రశేఖర రావు, అగ్రహారం - వివినమూర్తి, తప్పిపోయిన కుమార్తె - వినోదిని వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు కథలు - కథకులు - 18 సంకలనాల కథల సూచి, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
8. 'కథ - 2009'లో రంకె - నారాయణస్వామి, ఈస్థటిక్ స్పేస్ - దగ్గుమాటి పద్మాకర్, శిలకోల - మల్లిపురం జగదీశ్, అమల సబేషిణి ఆల్ఫోన్స్ - కొడైక్కాణల్ - భానకిరణ్, సుడిగాలి - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, మనమెప్పుడో... - అట్టాడ అప్పల్నాయుడు, జాగరణ - అజయ్‌ప్రసాద్, పరివర్తన - ఆరి సీతారామయ్య, ఆగిసాగిన అడుగులు - నల్లూరి రుక్మిణి, ఇగ వీడు తొవ్వకు రాడు - పెద్దింటి అశోక్‌కుమార్, అతను - సాయి బ్రహ్మానందం గొర్తి, దొమ్మరసాని - వంశీ, నాగరికథ - అనిల్ ఎస్.రాయల్ వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు కథలు - కథకులు, 20 సంకలనాల కథల సూచి, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
9. 'కథ - 2011'లో సరిహద్దు - సాయిబ్రహ్మానందం గొర్తి, ఖేయోస్ - బి.అజయ్‌ప్రసాద్, ఒక బంధం కోసం - అరుణ పప్పు, జీవం - స్కైబాబ, తప్పు - సతీష్‌చందర్, ఋణం - ముళ్లపూడి సుబ్బారావు, తల్లి భూదేవి - వల్లూరు శివప్రసాద్, ఇప్పమొగ్గులు - మల్లిపురం జగదీశ్, టెంకిజెల్ల - కె.ఎన్.మల్లీశ్వరి, అవ్వ - కె.వి.నరేందర్, సముద్రం - రమణజీవి, మూడుతొవ్వలు - బెజ్జారపు రవీందర్, కొత్తగూడెం పోరడికో లవ్‌లెటర్ - సామాన్య వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు కథలు - కథకులు, 22 సంకలనాల కథల సూచి, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.
10. 'కథ - 2012'లో అతడు - స్కైబాబ, ముస్తఫా మరణం - అఫ్సర్, హుస్సేన్ మై ఫాదర్ - సువర్ణకుమార్, మహిత - సామాన్య, కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు - విమల, ఉన్నంతలో - వి.రాజారామమోహనరావు, టోపీ జబ్బార్ - వేంపల్లె షరీఫ్, దమయంతి కూతురు - పి.సత్యవతి, జుమ్మేకి రాత్ మే - పెద్దింటి అశోక్‌కుమార్, వారధి - వారణాసి నాగలక్ష్మి, రయిక ముడి ఎరగని బతుకు - స.వెం.రమేష్, బిలం - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దేవరగట్టు - జి.వెంకటకృష్ణ వంటి ప్రముఖ రచయితల కథలతోపాటు కథలు - కథకులు, 23 సంకలనాల కథల సూచి, సంకలనాలు - ఆవిష్కరణలు పొందుపరచబడ్డాయి.