ఈ కథా సంపుటిలో 19 కథలున్నాయి. అవి వివిధ భాషల్లోంచి అనువాదం చేసినవి. దేనికదే ప్రత్యేక అస్తిత్వం కలిగిన కథలు. అనువాదం అంటే మాటల మార్పిడి కాదు. వాక్యాల బదలాయింపు అసలేకాదు. అదొక సృజన. అదొక ఆత్మల బదలాయింపు. మూల భాషలోని ఆత్మను లోతుగా వెళ్లి పట్టుకొని, పదిలంగా తెచ్చి ఇతర భాషల్లోకి లోతుగా వెళ్లి నాడటం. కట్‌ అండ్‌ ఫేస్ట్‌లా కాదు. ఎక్కడ ఏ మాత్రం అక్రశద్ధ చేసినా ఆత్మ చనిపోతుంది. ఒక రైతు పొలం దున్నుతున్నంత నిబద్ధత, విత్తనం నాటుతున్నంత దక్షతతోపాటు, ఒక డాక్టర్‌ ఒకరి గుండెను తీసి మరొకరికి అమర్చుతున్నంత నైపుణ్యం, కాలువలో చేపపలిల్లలను పట్టి చెరువులో వదలినంత నేర్పు కావాలి. ఇన్ని అర్హతలున్నాయి కాబట్టే శాంతసుందరిగారి ఈ పుస్తకం చేవ నిండిన కథలతో మన చేతుల్లో ఉంది.

ఈ సంపుటిలో గుండెను తడి చేసే కథలు, మనిషి లోతును ఆవిష్కరించే కథలు, సమాజాన్ని అద్దంలో చూపించే మంచి కథలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆకలి, పేదరికం ఒకే రకంగా ఉంటాయి.

పేజీలు : 197

Write a review

Note: HTML is not translated!
Bad           Good