పాతికేళ్ళ నడక...

    అలుపెరుగని నడక...

    అర్థవంతమైన నడక...

    కథ '90తో మొదలై నిరాటంకంగా సాగుతున్న నడక ఇది.

    ఈ నడకలో ఇది 25వ మైలురాయి. తెలుగు సమాజపు రాజకీయ,

    సాంస్కృతిక పరిణామక్రమాన్ని కథల ద్వారా ఆవిష్కరిస్తున్న

    కథా సంకలనాల పరంపర 'కథ 2014'.

    

    వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌ల

    సంపాదకత్వంలో పాతికేళ్లుగా

    ఉత్తమ కథలను పాఠకులకు అందిస్తున్న

    కథాసాహితి సంకలనాల పరంపరలో 25వది 'కథ 2014'.

 

    ఈ 'కథ 2014'లో రమాసుందరి బత్తుల, పాలగిరి విశ్వప్రసాద్‌, భగవంతం, పి.వి.సునీల్‌ కుమార్‌, తల్లావజ్ఞల పతంజలిశాస్త్రి, అద్దేపల్లి ప్రభు, మధురాంతకం నరేంద్ర, కొట్టం రామకృష్ణారెడ్డి, రాధిక, యాజి, స.వెం.రమేశ్‌, కల్పనా రెంటాల, సాయిబ్రహ్మానందం గొర్తి, విమల తదితర రచయితల 25 కథలు పొందుపరచబడినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good