మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ముస్లింల వశమైంది.

    కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ''మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?''... తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good