'ఈ నాగరిక ప్రపంచంలో అన్యాయాలతో యుద్ధం చేయటానికి కవులు, కళాకారులు, రచయితలు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలి' అంటూ రచయితల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఆప్టన్‌ సింక్లేర్‌. పాలకులనూ, వారి ప్రేమ వ్యవహారాలనూ, వారి వంశాలనూ పొగుడుతూ రచనలు చేసేవారు వందిమాగధులౌతారు కాని రచయితలు ఏమాత్రం కారు. తమ గురించి రాయడానికే, పొగడటానికే పాలకులు ఆస్థానకవులను ఏర్పరచుకున్నారు.

కాలంమారింది - దోపిడీ రూపాలు మారాయి. టెక్నాలజీ పెరిగింది. విద్య విజ్ఞానం పెరిగాయి. పత్రికలు, మీడియాలలో ఎన్నెన్నో మార్పులొచ్చాయి. పాలకులు కూడా కాలానికి తగ్గట్టుగా తమ వందిమాగధులను సృష్టించుకుంటూ వస్తున్నారు. సుతారంగా, గౌరవంగా వారిని పోషిస్తున్నారు. పాలకవర్గానికి నిరంతరం అండగా వుండే ఇలాంటి ఈ కవులు, కళాకారులు ప్రజలపక్షం ఎందుకు వహించారో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. 'కళామతల్లి'కి కూడా వర్గం వుంటుందన్న ఎరుక కలుగుతుంది. కళ గురించీ, కళా స్వభావం గురించీ, ప్రజాకళా దృక్పథం గురించీ, ప్రజాసాహిత్య సాంస్కృతికోద్యమ దృక్పధం గురించీ, రచయితల, కళాకారుల జీవితాదర్శాల గురించీ, వారి తప్పొప్పుల గురించీ నిష్పక్షపాతంగా అర్థం చేసుకోడానికీ ఈ పుస్తకం మనకు సహాయపడుతుంది.

''సోషలిస్టు సంస్కృతికి పాఠ్యగ్రంథం''.

ఆప్టన్‌ సింక్లేర్‌ 'మమనార్ట్‌' పరిచయం ఈ గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good