శ్రీశ్రీ కవిత్వాన్ని అర్థం చేసుకునే వారు ఇప్పటికీ తక్కువే. మొన్నటికి మొన్న ఒక పత్రికలో శ్రీశ్రీ రాసిన ఒక కవితా ఖండికపై, ముగ్గురు సాహితీ విమర్శకులు వారి వారి అభిప్రాయాలు చెప్పినపుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. 'వార్త' ఆదివారం సంచికలో 'వ్యత్యాసం' కవితపై ఆ వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ కవిత మధ్యతరగతి మీద ఎక్కుపెట్టిన బాణమనీ, మద్యతరగతిని పరిహసించడానికి శ్రీశ్రీ రాశాడని చాలామంది వ్యాఖ్యానించారు. కనుకే శ్రీశ్రీ కవిత్వాన్ని మళ్ళీమళ్ళీ పునర్మూల్యాంకనం చేయవలసిన అవసరం వుందని చాలా స్పష్టంగా మనకనిపిస్తుంది. 'వ్యత్యాసం' అంటే 'తేడా'. ఎవరెవరికి తేడా? పీడకవర్గానికీ, పీడితవర్గానికీ మధ్య వున్న తేడా. ధనస్వామ్య వర్గానికీ, నిరుపేద వర్గానికీ మధ్య వున్న తేడా. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా విడమరచి చెప్పిన కవిత అది. ఏ మాత్రం సామాజిక అవగాహన వున్న వారికైనా అర్థమయ్యే పద్ధతిలో చెప్పిన కవిత అది. వినండి.

''అదృష్టవంతులు మీరు,

వెలుగును ప్రేమిస్తారు.

ఇరులను ద్వేషిస్తారు.

మంచికీ చెడ్డకీ నడుమ

కంచుగోడలున్నాయి మీకు.''

ఎవరి గురించి ఇదంతా? ఎవరా అదృష్టవంతులు? ఎవరు చీకటిని ద్వేషించేవారు? వెలుగును ప్రేమించేవారు? మంచికీ, చెడ్డకీ మధ్య సొంత ఆస్తిలాగా కంచుగోడలు నిర్మించుకున్న వర్గం బూర్జువావర్గం.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good