శ్రామికవర్గ మహిళల అసాధారణ బతుకుపోరాట చిత్రాలివి. శ్రమే జీవితంగా, జీవితమే శ్రమగా కాలం గడుపుతూ కనీస జీవన వసతులు కూడా ఒనగూడని మహిళల జీవిత దర్పణం ఈ నివేదికలు. గాఢ సామాజికత, సంవేదనలు నింపుకున్న కథనాలివి.

భారత సమాజాన్ని ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్న శక్తుల మూలంగా శ్రామిక మహిళా జనం అనుభవిస్తున్న దుర్భర జీవన సంక్షోభానికి ఈ పుస్తకంలోని అధ్యయనాలు అద్దం పట్టాయి. ఇవి ప్రపంచాన్ని సాకుతున్న శ్రామిక మహిళల కఠోర జీవిత వాస్తవాలు. గణాంకాల కందని వేదనామయ అనుభవాలు.

మహిళా విముక్తి ఉద్యమం ఎంపిక చేసుకోవలసిన ప్రాతిపదికను ఈ అద్యయనాలు చూపెడతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good