కాశ్మీర్‌ సమస్యకు మూలాలు, కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ ప్రజల పట్ల గత ఏడు దశాబ్దాలుగా వ్యవహరించిన తీరు, ఈనాడు ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు అనుసరించవలసిన మార్గాలూ, కాశ్మీర్‌ ప్రజల వాంఛలూ మనం తెలుసుకుని చర్చించుకునేందుకే ఈ 'కాశ్మీర్‌ను కాపాడుకుందాం!' పుస్తకం.

''కరెంటు లేదు. ఇంటర్‌నెట్‌ లేదు. వార్తాపత్రిక లేదు. బడులు లేవు. సిఆర్‌పిఎఫ్‌కి దాని అధికారాన్ని ధిక్కిరించే వారికి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్‌ సూర్యుడు మళ్ళీ ఉదయించాడు! మరో రోజు మొదలయింది!'' - ఒక పౌరుని ఆవేదన

''మా తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పోనివ్వడం లేదు. నేను అందుకని బయటకు వెళ్ళి పదిరోజులయింది. భారత పోలీసులు మమ్మల్ని విరగదంతున్నారు. ఎల్లప్పుడూ నినాదాలతో మా చెవులు మారుమోగుతున్నాయి. మాకు భయం వేస్తోంది.'' - సఫన్‌ నిస్సార్‌ (13 సం||)

Pages : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good