కశ్మీర్‌ అనగానే ఈ రోజు మతోన్మాదం, హింస స్ఫురించే వాతావరణం నెలకొనింది గానీ సగటు కశ్మృరీలో ఇవేవీ కనిపించవు. 'మేము వేరు, మా బతుకు వేరు. మా పాటికి మమ్మల్ని ఉండనివ్వండి అంటే మీకెందుకు అర్థం కాదు? అని స్నేహంగానే విస్మయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ భావాలతో నిమిత్తం లేని వేరే ఏవేవో విషయాలకు కశ్మీర్‌ ప్రతీక అయిపోవడం వల్ల ఈ ప్రశ్న ఎవరికీ వినిపించదు. నెహ్రూ బ్రాండు లౌకికవాదులకు కశ్మీర్‌ ఆధునిక భారత లౌకికతకు ప్రతీక. అద్వానీ బ్రాండు దేశభక్తులకు కశ్మీర్‌ అఖండ భారత్‌కు ప్రతీక. పాకిస్తానీ పాలకులకు అనంతమైన జిహాద్‌కు ప్రతీక. కశ్మీర్‌ గురించి ఆలోచించడమంటే కశ్మీరీల కోసం ఆలోచించడమని మనమెప్పుడు అర్థం చేసుకుంటా?

Pages : 140

Write a review

Note: HTML is not translated!
Bad           Good