కర్ణుడు సామాన్యంగా జీవించిన అసామాన్యుడు, మాన్యుడు. మహనీయుడు, మహాయోగి. జన్మించింది మొదలు చివరివరకు మృత్యువు నీడలో నడుస్తూ, మృత్యువంటే భయం లేకుండా జీవిస్తూ, మృత్యువునే భయపెడుతూ, మృత్యువును జయించిన వాడు ... మృత్యుంజయుడు.
తనను వెన్నంటి వస్తున్న మృత్యువు నీడను చూచి కర్ణుడు ఏనాడూ భయపడలేదు. జీవితానికి ముందు, వెనుక మృత్యువు కాపలా అని తెలిసిన ధీశాలి, తాత్వికుడు కర్ణుడు. మృత్యువే తన సత్య సంధతకు భయపడి పారిపోయింది. అతను మృత్యుంజయుడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good