ఆర్ధిక బలహీనతలవలన కాని, మరి ఏ ఇతర బలహీనతలవలన కాని యీ కార్మికుడు న్యాయాన్ని కోల్పోకూడదు. కార్మికుడు సంతృప్తి పడాలంటే అతని సంక్షేమము , ఉద్యోగ భద్రత అత్యావశ్యకం. కార్మిక చట్టం ఒక మహాసముద్రం. అయినప్పటికి , ఒక సాధారణ వ్యక్తీ కూడా ఈ చేతి పుస్తకం కాహ్డివి కార్మిక చట్టాల గురించి కొంతవరకు అవగాహన కల్పించు కోవాలనేదే నా ప్రయత్నం. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికి చట్టాల క్రింద వచ్చు హక్కులు, బాధ్యతలు గురించి ఒక అవగాహన కల్పిస్తుంది. కార్మిక చట్టాల ముఖ్య ఉద్దేశ్యములు సజావుగా అర్ధం చేసుకోవటానికి ఉపకరిస్తుంది. తమకోసం ఒక చట్టం ఉందని తెలియని పేద కార్మికులేందరో వున్నారు. వారికి ఇది ఒక గైడులా పనికోస్తుందనుకుంటాను. వారి శ్రమ దోపిడీకి గురికాకుండా చూస్తూ, అదే సమయంలో వారి బాద్యతలు గుర్తు చేస్తుంది. అదే విధంగా ప్రొఫెషనల్స్ కు , విద్యార్దులకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అదించగలుగుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good