కర్మయోగి వీరబ్రహ్మం

వీరబ్రహ్మం తత్వాలుగానీ వేమన పద్యాలుగానీ లేని ఫుట్‌పాత్‌ పుస్తకాల దుకాణం ఉండదు. ఈ తరంవాళ్ళు బ్రహ్మం తత్వాలను ఎక్కువగా పాసింజరు రైళ్ళలో గుడ్డి బిచ్చగాళ్ళ ద్వారానే వినగలుగుతున్నారు. మనకా దృష్టి పోయింది గానీ ఇప్పటికీ సంతల్లో, జాతరల్లో, సత్రాల్లో ఉన్నవారి ఇళ్ళు వాకిళ్ళలో వీధుల్లో ఈ తత్వాలు పాడే బిచ్చగాళ్ళూ, ఏకతార మీటుతూ పోయే గంజాయి బైరాగులూ కనిపిస్తారు. ఫుట్‌పాత్‌ల మీద గుజిలీ ప్రతుల్లో లేనివీ ఉన్న వాటికి భేదాలు, విస్తరణలు నాలుకల మీద వినబడుతున్నాయి. గుజిలీ పుస్తకాల్లో బ్రహ్మం తత్వాలతో పాటు దూదేకుల సిద్ధప్ప, యాగంటి లక్ష్మప్ప, ఈశ్వరమ్మ మొదలైన పదిమంది చెప్పిన వందకుపైగా తత్వాలు లభిస్తున్నాయి.

వీరబ్రహ్మం పేరుతో ఉన్న తత్వాలన్నీ ఆయనవి కావనీ వాటిలో ఆయన శిష్యులవో భక్తులవో చేరి అంతా కలగాపులగం అయిందని సంప్రదాయజ్ఞులంటున్నారు. కాలజ్ఞాన తత్వ సంప్రదాయంలోని వారివి బాలాంత్రపు రజనీకాంతరావుగానే పన్నెండు పేర్ల జాబితా ఇచ్చారు. రికార్డుకోసం వారిని ఇక్కడ పేర్కొనడం అవసరం. పూదోట రామన్న, చిత్తూరు నరసింహదాసు, కాలువ కోటయ్య, కొమళ్ళూరు వీరరాఘవులు, తాడిచెర్ల చలమయ్య, తాడిచెర్ల శేషయ్య, నాసరయ్య, నాసరయ్యదయతో అహోబలదాసు, సున్నపు గుంటరాఘవులు, మహమ్మదు హుస్సేను, తరిగొండ భ్రమరాంబా, నరహరి, జక్కులేటి కంబగిరి, ఘంటయ్య.

వీరబ్రహ్మం శిష్యునికోసం ''సిద్ధబోధము'' అనే గ్రంథం రాశాడు. అదిప్పుడు శిథిలమై లభిస్తుంది. బ్రహ్మం మార్గంలో ఏగంటి లక్ష్మప్ప వచనాలు లభిస్తున్నాయి. మద్రాసు ఓరియంటల్‌ లైబ్రరీలో ''ఏగంటి వచనాలు'' కనబడుతున్నాయి....

పేజీలు : 40

Write a review

Note: HTML is not translated!
Bad           Good