ఆ రోజు ఫీజు వసూలు చేసే రోజు. ఉపాధ్యాయుల ముందున్న టేబుల్స్ మీద రూపాయలు కుప్పలు కుప్పలుగా పోసి వున్నాయి. నలువైపుల నుంచీ రూపాయల మోతలు గల్లు గల్లున మ్రోగుతున్నాయి. షరాబుల దగ్గరకూడా అంత మోత వినిపించదు. ప్రతిమాస్టరు తాలూకాఫీసు బంట్రోతులాగా కూర్చున్నాడు. ఏ విద్యార్థి పేరు పిలిస్తే ఆ విద్యార్థి ఉపాధ్యాయుని దగ్గరకు వచ్చి ఫీజు చెల్లిస్తున్నాడు. తరువాత తన స్థానంలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు. అది మార్చినెల. ఆ నెలలోనే మే, జూన్ మాసాల ఫీజుకూడా వసూలు చేస్తున్నారు. దానికితోడు పరీక్ష ఫీజుకూడా వసూలు చేస్తున్నారు. పదవ తరగతిలో ఒక్కొక్క విద్ద్యార్థి నలభై రూపాయలదాకా చెల్లించవలసి వస్తున్నది.

ఉపాధ్యాయుడు ఇరవయ్యో పేరు పిలిచాడు. "అమర్‌కాంత్!"

అమర్‌కాంత్ క్లాసులో లేడు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good