కర్మ

                అడవి దారిలో ఇద్దరు యువకులు నడిచిపోతున్నారు. ఒకడు పొడుగు, ఒకడు పొట్టి.

                పొడవుగా వున్న యువకుడి పేరు యతీంద్ర. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది మించదు. స్ఫురద్రూపి అని చెప్పలేం కాని నిమ్మపండు రంగులో వున్న అతడి వర్ఛస్సు చూస్తే ఉన్నత కుటుంబానికి చెందినవాడని అర్థమవుతుంది.

                వంకీల జుత్తు, కోల ముఖం, పెద్దపెద్ద కళ్ళు, విశాల ఫాలభాగం, చప్పిడి బుగ్గలు. ముఖ్యంగా అతడి ముక్కు గ్రద్ద ముక్కులా వంపు తిరిగి ఇట్టే ఆకర్షిస్తుంది. పొడవు మెడ, గొంతుముడి ఎత్తుగా తెలుస్తోంది. విశాలమైన ఛాతీ, సన్నటి నడుం, ఎక్సర్సెజ్బాడీ గావటంతో కండలు తిరిగిన దండలుయ బలిష్టుడని చాటుతున్నాయి....

పేజీలు : 430

Write a review

Note: HTML is not translated!
Bad           Good