‘ఆరుద్రగారి ఆశీర్వాదంతో ప్రారంభమయిన ’కన్యాశుల్కం’ నాటకానికి ’చిన్న తెర’ రూపం యింతింతై వటుడింతై అన్నట్టుగా విశ్వరూపం దాల్చి నభూత నభవిష్యతి అన్నట్టుగా రూపుదిద్దుకొంది.
మహాకవి గురజాడ 115 సంవత్సరాల క్రితం రచించిన నాటకం మొట్ట మొదటిసారిగా యథాతదంగా – దాదాపు 8 గంటల ప్రదర్శన – టీవీలోకి వచ్చింది. ఇందులో 42 పాత్రలు.
ప్రముఖ రచయిత, నటులు రావికొండలరావు గారి దర్శకత్వంలో రూపు దిద్దుకొన్న ఈ నాటకంలో ప్రముఖ రచయిత, నటులు గొల్లపూడి మారుతీరావు గారు ’గిరీశం’ పాత్ర నిర్వహించారు. పౌరాణిక రంగంలో తనదైన శైలితో ప్రాచుర్యాన్ని సాధించిన మహా నటులు పీసపాటి నరసింహమూర్తి గారు తన 80వ ఏట- మొట్టమొదటి సారిగా – ఆధునిక నాటకంలో కన్యాశుల్కంలో లుబ్ధానధాన్లుగా వేషం కట్టారు.
ప్రముఖ నేపధ్య గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు రాంభట్ల నృసింహశర్మగారు రాసిన ప్రారంభగీతాన్ని ఆలపించారు. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ స్వరకల్పన చేశారు.
ప్రసిద్ధ నటులు రాధా కుమారి, జయలలిత, దాడి వీరభద్రరావు, కాశీవిశ్వనాధ్, కళ్ళు చిదంబరం, వడ్లమాను కామేశ్వరావు, విశాఖ ప్రాంతానికి చెందిన రంగస్థల నటులూ పాత్రలు ధరించారు.
తెలుగు జాతి గర్వించదగ్గ కళాఖండాలు కాలదోషం పట్టకుండా రేపటి తరానికి నిక్షిప్తం చేసే బృహత్తర కార్యక్రమానికి ’నాంది’ యిది. కళాతపస్వి క్రియేషన్స్ తరపున టీవీ సీరియల్ ‘కన్యాశుల్కం’ తెలుగు జాతి గర్వించదగ్గ సార్వజనీనమయిన, మొదటి ఆధునిక నాటకం. - మల్లాది సచ్చిదానందమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good