కవి ఆనందము
1
¬రుమనెడి ఘోరమైన తుపానులో మున్నీటనావలు మునిగిననేమి? సముద్రము పొంగి పొరలిననేమి? నాకది భయానకము కాదు, ఆ గంభీర సంద్రమున, ఆ అనిలోద్దుత వీచికాతుంపరలపైనెక్కి నృత్యము చేసెదను.
2
కృష్ణానది పొంగి పొరలిరానీ! గిరగిర తిరుగుచు నురుగులు కక్కుచూ కాళ మృత్యువులాగు కనిపించనీ, ఆఝరీవేగము నన్నాకర్షించును. కృష్ణవేణి తరంగమాలికల పైనుయ్యాల లూగుదును. కృష్ణాతరంగములతో గొంతెత్తి పాడుదును. మదురగాన మొనరింతును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good