ప్రాణం అమూల్యమైనది. త్యాగం అజరామరమైనది. కన్నెగంటి హనుమంతు ప్రాణత్యాగం పల్నాటికి కీర్తికిరీటం. కన్నెగంటి హనుమంతు మా పల్నాడు ప్రాంత జాతియోద్యమ నాయకుడు. బ్రిటీషు తుపాకీ తూటాలకు ఆత్మత్యాగం చేసినవాడు. తెల్లవారి ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు కోసమే జీవితాన్ని అర్పించినవాడు. అలాంటి త్యాగమూర్తి జీవిత గమనాన్ని అక్షరబద్ధం చేసే అవకాశం కలగడం నా అదృష్టం. కథనం చిన్నదే అయినా భావం చాలా విస్తృతమైనది. కన్నెగంటి పోరాటం, ప్రాణత్యాగం పల్నాడుకు శోభాయమానం. ఆయన ఆదర్శ జీవనం కేవలం పల్నాటికే గాకుండా యావత్‌ భారత్‌కు సార్వకాల ఆచరణీయ మార్గదర్శనమే. కన్నెగంటిని గుర్తు చేసుకోవడమూ, స్మరించుకోవడమే ఆయనకు నివాళి కాదు. ఆయన అడుగుజాడలలో కనీసం ఒక్క అడుగైనా వేయడమే ఆయనకు మనమిచ్చే కృతజ్ఞతాంజలి. కన్నెగంటి జీవిత చరిత్రను వందల పుటలుగా మలచవచ్చు. చదువరులు సులభంగా ఆకళింపు చేసుకోవటానికి కథాంశాన్ని సంక్షిప్తం చేశాను.

-రచయిత వై.హెచ్‌.కె.మోహన్‌రావు

పేజీలు : 22

Write a review

Note: HTML is not translated!
Bad           Good